నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యపై వాహనదారులకు వినూత్నంగా అవగాహన కల్పించారు. ట్రాఫిక్ పోలీసులు చిన్న పిల్లలతో ప్లేకార్డులు చూపించి, సిగ్నల్స్ వద్ద రూల్స్ పాటించాలని కోరారు. రూల్స్ అతిక్రమిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని ట్రాఫిక్ సీఐ ప్రసాద్ తెలిపారు. సీపీ సాయి చైతన్య ఆదేశాల మేరకు ఏసీపీ మస్తాన్ అలీ ఆధ్వర్యంలో ఈ అవగాహన కార్యక్రమం నిరంతరం కొనసాగుతుందని ఆయన చెప్పారు.