హొన్నాజిపేట్ జడ్పీ ఉన్నత పాఠశాలలో శనివారం విద్యార్థులకు రోబోటిక్స్‌పై ప్రత్యేక అవగాహన వర్క్‌షాప్ నిర్వహించారు. సోహం అకాడమీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో రోబోటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. విద్యార్థులకు ఆర్డినో వినియోగం, సెన్సార్ సాంకేతికత, రోబోటిక్స్ పనితీరు, వివిధ రంగాల్లో వాటి వినియోగం గురించి నిపుణులు ప్రాయోగికంగా వివరించారు.
విద్యార్థులు ఆసక్తిగా పాల్గొని రోబోటిక్స్‌కు సంబంధించిన ప్రాథమిక అంశాలను నేర్చుకున్నారు. ప్రస్తుత సాంకేతిక యుగంలో విద్యార్థుల్లో సృజనాత్మకత, శాస్త్రీయ దృక్పథం, సమస్య పరిష్కార నైపుణ్యాలను వివరించారు.