భూభారతి పెండింగ్ దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలని కలెక్టర్ టి. వినయ్ కృష్ణారెడ్డి ఆదేశించారు. శుక్రవారం ఇందల్వాయి తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆయన, భూభారతి, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియపై సిబ్బందితో సమీక్షించారు. నిర్ణీత గడువులోగా అన్ని దరఖాస్తులను పరిష్కరించాలని, తిరస్కరణకు గల కారణాలను స్పష్టంగా తెలపాలని సూచించారు. భూభారతి దరఖాస్తులకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, అర్జీల పరిష్కారంలో జాప్యం జరగకుండా పర్యవేక్షించాలని సూచించారు.