ధర్పల్లిలో వడ్ల కొనుగోలుపై బీజేపీ ఆగ్రహం

494చూసినవారు
ధర్పల్లిలో వడ్ల కొనుగోలుపై బీజేపీ ఆగ్రహం
ధర్పల్లి మండల కేంద్రంలో వడ్ల కొనుగోలు ప్రక్రియ అస్తవ్యస్తంగా ఉందని, ప్రభుత్వం తక్షణమే స్పందించి వడ్ల కొనుగోలు చేపట్టాలని ధర్పల్లి మండల బీజేపీ అధ్యక్షులు మైపాల్ డిమాండ్ చేశారు. మండలంలోని కొనుగోలు కేంద్రాల్లో దొడ్డు వడ్లను కొనుగోలు చేయకపోవడం కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యమని ఆయన ఆరోపించారు. ఐకెపి, ఐడిసిఎంఎస్, కొనుగోలు సెంటర్లలో దొడ్డు వడ్లకు అలాట్మెంట్ లేదని, ఇది ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. ఎండ తీవ్రతకు రైతులు వడదెబ్బతో ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని, వెంటనే వడ్లు కొనుగోలు చేయాలని ఆయన కోరారు.
Job Suitcase

Jobs near you