రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో 'మన ఇందూరు మన మేయర్' నినాదంతో ముందుకు వెళ్తామని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ తెలిపారు. నిజామాబాద్‌లోని బిజెపి జిల్లా పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ సమక్షంలో, 22వ డివిజన్ నుండి మాజీ కార్పొరేటర్ పోతుల పురుషోత్తంతో పాటు సుమారు 200 మంది బిజెపిలో చేరారు. ప్రధాని నరేంద్ర మోడీ అవినీతి రహిత పాలనతో భారతదేశాన్ని ప్రపంచంలోనే నెంబర్ వన్ గా తీర్చిదిద్దుతున్నారని ఆయన కొనియాడారు.