బీజేపీ తరఫున NZB కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల రెండో విడత జాబితాను ఆదివారం రాత్రి డివిజన్ల వారీగా విడుదల చేశారు. ఈ జాబితాలో 11వ డివిజన్ గట్ల గంగాధర్, 12వ డివిజన్ అక్తరీ బీ, 30వ డివిజన్ వైచాల మీరా, 32వ డివిజన్ తహసీన్ సుల్తానా, 33వ డివిజన్ నాజీయ తబస్సుమ్, 51వ డివిజన్ R. బాలకిషన్, 52వ డివిజన్ కోరేడి కిరణ్, 55వ డివిజన్ మహ్మద్ ఇమ్రాన్ ఖాన్, 15వ డివిజన్ మేదరి శేఖర్, 13వ డివిజన్ మాలవత్ కీర్తి పేర్లు ఉన్నాయి. ఈ ప్రకటనతో ఎన్నికల ప్రచారం మరింత ఊపందుకునే అవకాశం ఉంది.