ధర్పల్లి మండలం మద్దుల్ తాండలో మంగళవారం రూరల్ బీఆర్ఎస్ పార్టీ ఇన్చార్జి జగన్మోహన్, గ్రామ శ్రేణులతో కలిసి గణనాథుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు మహిపాల్ యాదవ్, మాజీ ఎంపీపీ సారిక హనుమంత్ రెడ్డి, సొసైటీ చైర్మన్ రాజేందర్ మాజీపేట్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు శివరాం, పీస్ రాజేశ్వర్, రామడుగు సర్పంచ్, మద్దుల్ తాండ, ఎస్బీ తాండ గ్రామ శాఖ అధ్యక్షులు రమేష్ నాయక్, బడియా నాయక్, శ్రీరామ్, శంకర్ నాయక్, రవి, వెంకట్ రాజ్ తదితరులు పాల్గొన్నారు.