శాంతి భద్రతలకు విఘాతం కలిగిoచే వారి సమాచారం ఎవ్వరికైనా తెలిసిన మీ దగ్గరలోని పోలీస్ స్టేషన్ కు తెలియజేయాలని సీపీ పోతరాజు సాయిచైతన్య శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. లేకుంటే ఈ దిగువ తెలియజేసిన ఫోన్ నెంబర్లకు తెలియజేయగలరు. డయల్ 100, స్పెషల్ బ్రాంచ్ నంబర్- 87126-59777, పోలీస్ కంట్రోల్ రూమ్ నెంబర్: 08462-226090 లకు సమాచారం ఇవ్వగలరు. సమాచారం అందించిన వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు.