నేటి నుండి జన గణన స్వీయ నమోదు ప్రక్రియ

781చూసినవారు
జిల్లాలోని అధికారులు, ఉద్యోగులు, విద్యావంతులు, ప్రజలు జన గణన స్వీయ నమోదు చేసుకోవాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. ఈ నెల 26వ తేదీ నుండి మే 10వ తేదీ వరకు https://se.census.gov.in పోర్టల్ ద్వారా స్వీయ నమోదు చేసుకోవచ్చు. భారత ప్రభుత్వం జన గణన – 2027 ప్రక్రియను రెండు దశలలో చేపడుతోంది. మొదటి దశలో మే 11 నుండి జూన్ 09 వరకు ఇండ్ల గణన, రెండవ దశలో 2027 ఫిబ్రవరి 09 నుండి 28 వరకు జనాభా, కులగణన జరుగుతుంది.

సంబంధిత పోస్ట్