ఇందూరు సంస్కృతి కళావేదిక ఆధ్వర్యంలో న్యూ అంబేద్కర్ భవన్ లో జరిగిన జానపద కళా ఉత్సవ్ కార్యక్రమంలో నగర మేయర్ కూరగాయల ఉమారాణి, సమీక్షి గౌడ్ ను ఉత్తమ ప్రశంసా పత్రంతో సన్మానించి అభినందించారు. ఇటీవల తిరుపతిలో తాళ్లపాక అన్నమాచార్యుల ఉత్సవాలలో శ్రీమన్నారాయణ కళాభారతి లో సమీక్ష ఇచ్చిన ప్రదర్శనకు ఉత్తమ ప్రశంస పత్రంతో సన్మానించారు. మెహర్ బాబా జన్మదిన శుభ సందర్భంగా కూడా శ్రీ నటరాజు కళాక్షేత్రంలో ప్రదర్శన ఇచ్చారు. ఈ కార్యక్రమాలన్నీ ఆమె గురువు నరేష్ ఆధ్వర్యంలో జరిగాయి. మేయర్ ఉమా రాణి, సమీక్షతో పాటు గురువు నరేష్ ను కూడా అభినందించారు.