నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలంలోని దుబ్బాక గ్రామంలో ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) కింద ఆరు చెక్కులను లబ్ధిదారులకు శుక్రవారం అందజేశారు. బొల్లారం ఎర్రన్న, మంద సాన్విక, చంద్రపల్లి దితీష్, నల్లూరి రజిత, పాతి లక్ష్మి (రెండు చెక్కులు) మొత్తం రూ. 2,00,000 పైగా విలువైన చెక్కులను గ్రామ శాఖ అధ్యక్షులు పోతన్న, మాజీ ఉపసర్పంచ్ ప్రతాప్ గౌడ్, గోస్కొండ అశోక్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డికి, జిల్లా కాంగ్రెస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ ఆర్మూర్ చిన్న బాల్ రాజ్ కు కృతజ్ఞతలు తెలిపారు.