నిజామాబాద్ జిల్లా, ధర్పల్లి మండలంలోని రామడుగు గ్రామంలో గురువారం ముగ్గురు బాధితులకు రూ. 1.27 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి ఆధ్వర్యంలో పంచాయతీ కార్యాలయంలో
కాంగ్రెస్ గ్రామశాఖ అధ్యక్షుడు ఆనంద్, నాయకులు రమేష్, రవితేజ బాధితులకు ఈ చెక్కులను అందించారు. సీఎంఆర్ఎఫ్ ద్వారా ఆర్థిక సాయం పొందిన బాధితులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.