*వైద్యారోగ్య శాఖ పనితీరుపై సమీక్షలో కలెక్టర్ ఇలా త్రిపాఠి*

3చూసినవారు
*వైద్యారోగ్య శాఖ పనితీరుపై సమీక్షలో కలెక్టర్ ఇలా త్రిపాఠి*
జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి నిరుపేద ప్రజలకు వైద్య సేవలు అందించే అవకాశాన్ని అదృష్టంగా భావించాలని, అంకితభావంతో మెరుగైన సేవలు అందించాలని వైద్యాధికారులకు, సిబ్బందికి సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో గురువారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ పనితీరుపై ఆయన సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ ఆసుపత్రులు, పీహెచ్‌సీలు, ఆరోగ్య ఉప కేంద్రాల నిర్వహణ తీరుతెన్నులను అడిగి తెలుసుకున్నారు. క్షేత్ర స్థాయి నుండి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి వరకు అందరూ అంకితభావంతో పనులు నిర్వర్తించాలని, తమ ఉద్యోగాన్ని దైవంతో సమానంగా భావించాలని అన్నారు. వైద్యారోగ్య శాఖ పనితీరును నిరంతరం పర్యవేక్షిస్తామని, నిర్లక్ష్యం వహించే వారిపై కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్