మంత్రి సీతక్క పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్

1చూసినవారు
మంత్రి సీతక్క పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్
రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క బుధవారం నిజామాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో, మంత్రి పర్యటన ఏర్పాట్లను కలెక్టర్ ఇలా త్రిపాఠి మంగళవారం పరిశీలించారు. జిల్లా కేంద్రంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో జరిగే కార్యక్రమాలలో మంత్రి పాల్గొంటారు. కలెక్టర్ ఆడిటోరియంను సందర్శించి, ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించి, అధికారులకు సూచనలు చేశారు. ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా ఏర్పాట్లు చేయాలని ఆమె ఆదేశించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్