ఎన్నికల ఏర్పాట్లపై అధికారులతో కలెక్టర్ సమీక్ష*

3చూసినవారు
ఎన్నికల ఏర్పాట్లపై అధికారులతో కలెక్టర్ సమీక్ష*
బుధవారం, జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఇలా త్రిపాఠి మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. నగర పాలక సంస్థ కార్యాలయాన్ని సందర్శించి, కమిషనర్ దిలీప్ కుమార్ ను డిస్ట్రిబ్యూషన్, పోలింగ్ ఏర్పాట్ల గురించి అడిగి తెలుసుకున్నారు. అభ్యర్థులకు గుర్తుల కేటాయింపు పూర్తయిన నేపథ్యంలో బ్యాలెట్ పేపర్లు, పోస్టల్ బ్యాలెట్ ముద్రణపై ఆరా తీశారు. గోప్యత పాటిస్తూ, ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా ముద్రణ జరిపి, పోలీసు భద్రత మధ్య స్ట్రాంగ్ రూమ్ లకు తరలించి భద్రపరచాలని ఆదేశించారు. ముద్రణ అనంతరం సాఫ్ట్ కాపీలను హార్డ్ డిస్క్ నుండి తొలగించేలా పర్యవేక్షణ చేయాలని సూచించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you