జిల్లా కేంద్రంలోని వినాయకనగర్ లోని ఈవీఎం గోడౌన్ ను కలెక్టర్ ఇలా త్రిపాఠి, అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ మంగళవారం సందర్శించారు. సాధారణ పరిశీలనలో భాగంగా క్షేత్రస్థాయి సందర్శన జరిపి, ఈవీఎం గోడౌన్ సీళ్లను, పోలీసు బందోబస్తును పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎన్నికల పర్యవేక్షకుడు బాలరాజు, సిబ్బంది సాత్విక్, విజయేందర్ రెడ్డి, అగ్నిమాపక అధికారి శంకర్ తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు.