కొరియర్ లో పార్సల్ మిస్సయిందని ఫిర్యాదు

1చూసినవారు
కొరియర్ లో పార్సల్ మిస్సయిందని ఫిర్యాదు
నగరంలోని ఆర్​ఆర్​చౌరస్తా వద్ద స్థానిక రెండో టౌన్​లో కెతావత్​ వెంకట రాములు అనే బాధితుడు ఫిర్యాదు చేశారు. గతనెల 12న ఖలీల్​వాడిలోని ఓ ప్రైవేట్​ కొరియర్​ ద్వారా నాలుగు ట్యాబ్​లున్న పార్శిల్​ పంపినట్లు తెలిపారు. అయితే, పార్శిల్​ చేరాల్సిన స్థలానికి చేరలేదని, విచారించగా కొరియర్​ సిబ్బంది దానిని మిస్​ప్లేస్​ చేసినట్లు తెలిసిందని పేర్కొన్నారు. హైదరాబాద్​లోని కొరియర్​ బ్రాంచ్​ మేనేజర్​ను సంప్రదించినా సరైన సమాచారం లభించలేదని, తమకు న్యాయం చేయాలని బాధితుడు కోరారు.

ట్యాగ్స్ :