నిజామాబాద్: పోలీస్ స్టేషన్ లను తనిఖీ చేసిన సీపీ

68చూసినవారు
నిజామాబాద్: పోలీస్ స్టేషన్ లను తనిఖీ చేసిన సీపీ
నిజామాబాద్ జిల్లాలోని మెండోరా, ముప్కాల్, బాల్కొండ పోలీస్ స్టేషన్ లను సీపీ సాయి చైతన్య ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది వెల్ఫేర్ గురించి, రికార్డ్స్ నిర్వహణ గురించి పోలీస్ స్టేషన్ బిల్డింగ్ గురించి అడిగి తెలుసుకున్నారు. మండలంలో గల క్రైమ్ గురించి కూడా తెలుసుకున్నారు. మండల ప్రజలతో మంచి సత్సంబంధాలు కలిగి వుండి పోలీసు వ్యవస్థకు మంచి పేరు తెచ్చే విధంగా పోలీసులు క్రమశిక్షణతో ఉండాలని ఆదేశించారు.

సంబంధిత పోస్ట్