జిల్లాకేంద్రంలోని పోలీసు కమిషనరేట్లో సోమవారం నిర్వహించిన పోలీసు ప్రజావాణికి 11 ఫిర్యాదులు అందాయి. సీపీ సాయిచైతన్య వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల నుంచి సమస్యలను విని పరిష్కారానికి ఆదేశించారు. ప్రజలు నిర్భయంగా, మూడవ వ్యక్తి ప్రమేయం లేకుండా పోలీసు సేవలను వినియోగించుకోవాలని సీపీ సూచించారు. శాంతి భద్రతలను పరిరక్షించడమే లక్ష్యంగా పోలీసుశాఖ పనిచేస్తుందని సీపీ పేర్కొన్నారు.