నిజామాబాద్ నగరంలో నేరాలను నియంత్రించడానికి, ప్రజల భద్రతను మెరుగుపరచడానికి సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని సీపీ పోతరాజు సాయి చైతన్య ఆన్నారు. శుక్రవారం నగరంలోని ఆరవ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో దాతల సహకారంతో 30 సీసీ కెమెరాలను సీపీ ప్రారంభించారు. ఈ సందర్భంగా సీపీ సీసీ కెమెరాల ప్రాముఖ్యతను, వాటి వల్ల కలిగే ఉపయోగాలను ప్రజలకు స్థానిక భాష (ఉర్దూ) లో వివరించారు. సీసీ కెమెరాలు నేరాలను అరికట్టడం, నేరస్తులను గుర్తించడంలో ఎంతగానో ఉపయోగపడతాయన్నారు.