రాష్ట్ర రైతు కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్ శుక్రవారం నగరంలోని కిషన్ గంజ్ ప్రాంతంలో పలు విత్తన దుకాణాలను తనిఖీ చేశారు. వానాకాలం సాగుకు సిద్ధమవుతున్న రైతులకు మార్కెట్లో నకిలీ విత్తనాలు అమ్మితే క్రిమినల్ కేసులు తప్పవని ఆయన హెచ్చరించారు. వ్యవసాయశాఖ జేడీ ఏ వీరాస్వామి, హార్టికల్చర్ అధికారులతో కలిసి ఆయన పలు దుకాణాలలో విత్తనాలను, స్టాక్ రిజిస్టర్ ను, అమ్మిన రసీదులను పరిశీలించారు. జిల్లాలోకి మహారాష్ట్ర, చత్తీస్గడ్, కర్ణాటక నుంచి నకిలీ విత్తనాలు వస్తున్నట్లు సమాచారం ఉందని, రైతులు విత్తనాలు కొనే ముందు జాగ్రత్తగా పరిశీలించాలని ఆయన సూచించారు.