సైబర్ నేరాలకు పాల్పడుతున్న పదిమందిని నాలుగో టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. ఇటీవల నాలుగోటౌన్ పోలీస్ స్టేషన్లో సైబర్ మోసాలపై కేసులు నమోదయ్యాయి. దీంతో విచారణ చేపట్టిన పోలీసులు వివిధ ప్రాంతాలలోని సైబర్ నేరగాళ్లను గుర్తించి అరెస్టు చేశారు. నిందితులు అక్రమంగా బ్యాంకు ఖాతాలను తెరిపిస్తూ నేరాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. ఈ అరెస్టులతో సైబర్ నేరగాళ్లపై పోలీసుల కొరడా విసురుతున్నట్లు స్పష్టమైంది.