జిల్లా అటవీశాఖాధికారి విక్రమ్ సింగ్ బదిలీ అయ్యారు. జిల్లాకు వచ్చి రెండు నెలలు కూడా పూర్తి కాకముందే ఆయన కొత్తగూడెం డీఎఫ్వోగా వెళ్తున్నారు. ఈ బదిలీ చర్చనీయాంశంగా మారింది. ఆయన స్థానంలో ఆదిలాబాద్ డీఎఫ్వోగా విధులు నిర్వహిస్తున్న ప్రశాంత్ బాజీరావు పాటిల్ నూతన డీఎఫ్వోగా జిల్లాకు రానున్నారు. ప్రశాంత్ బాజీరావు పాటిల్ త్వరలో బాధ్యతలు స్వీకరించనున్నారు.