ధర్పల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్. జ్యోతికి తెలంగాణ రాష్ట్ర కళాశాల విద్యా కమిషనర్ కామర్స్ విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్గా గురువారం పదోన్నతి కల్పించారు. నిజామాబాద్ జిల్లాలోని ఈ కళాశాల అభివృద్ధికి ఆమె చేసిన కృషిని అధ్యాపకులు అభినందించారు. విద్యార్థుల కార్యక్రమాలకు ఆమె అందిస్తున్న ప్రోత్సాహం ప్రశంసనీయమని తెలిపారు.