దుబ్బాక గ్రామంలో 12 సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

459చూసినవారు
దుబ్బాక గ్రామంలో 12 సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ
ధర్పల్లి మండలంలోని దుబ్బాక గ్రామంలో ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. గ్రామ శాఖ అధ్యక్షులు పెండ అరుణ్ ఆధ్వర్యంలో లబ్ధిదారులకు సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా సుమారు రూ. 6 లక్షల విలువైన చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కుటుంబాలకు ప్రభుత్వం అందిస్తున్న సీఎంఆర్‌ఎఫ్‌ ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. లబ్ధిదారులు రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపతిరెడ్డికి, డిసిసి ఉపాధ్యక్షులు ఆర్మూర్ చిన్న బాల్ రాజ్ కి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పోతున్న, సంతోష్, ప్రేమ్, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్