నగరంలోని ఆరవ డివిజన్ మహాలక్ష్మి నగర్ బ్యాంక్ కాలనీ ప్రాంతంలో కుక్కల స్వైర విహారంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. రాత్రి వేళల్లో గుంపులు గుంపులుగా కుక్కలు రావడంతో రోడ్డుపై నడవాలంటేనే జంకుతున్నారు. నిత్యం రద్దీగా ఉండే ప్రాంతాల్లో కుక్కలు స్వైర విహారం చేస్తున్నా మున్సిపల్ అధికారులు, స్థానిక కార్పొరేటర్ పట్టించుకోవడంలేదని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బ్యాంక్ కాలనీ ప్రాంతంలో మహాలక్ష్మి నగర్ రోడ్ నెంబర్ 3 ప్రాంతంలో కుక్కలు అధికంగా రోడ్డుపైకి వస్తున్నాయి. గత రెండు మూడు రోజులుగా ఈ కుక్కలు పదిమందికి తీవ్ర గాయాలయ్యాయి. ఇప్పటికైనా స్థానిక కార్పొరేటర్ పట్టించుకోవాలని కోరుతున్నారు.