కలెక్టర్ కృష్ణారెడ్డి పాఠశాలల నిర్వహణలో ఎంఈవోలు, హెచ్ఎంలు నిర్లక్ష్యం వహించవద్దని, అంకితభావంతో పనిచేయాలని సూచించారు. మంగళవారం కలెక్టరేట్లో విద్యాశాఖ పనితీరుపై ఎంఈవోలతో సమీక్ష నిర్వహించిన ఆయన, ప్రతి పాఠశాలలో కనీస సదుపాయాలు కల్పించాలని, విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించి ఫలితాలు మెరుగుపరచాలని ఆదేశించారు. పదో తరగతి ఉత్తీర్ణత శాతం పెంచాలని, మధ్యాహ్న భోజనం నాణ్యత విషయంలోనూ నిర్లక్ష్యం వహించరాదని స్పష్టం చేశారు. అభివృద్ధి, మరమ్మతు పనుల వివరాలు ఎంఈవోలు, ప్రధానోపాధ్యాయులకు తెలిసి ఉండాలని తెలిపారు.