తెలంగాణలో పెండింగ్ లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలపై హైకోర్టు తీర్పునకు రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం, పథకాన్ని ఎత్తివేసే కుట్రగా ప్రైవేట్ విద్యాసంస్థలు భావిస్తున్నాయి. ఈ పథకాన్ని నిర్వీర్యం చేస్తే విద్యార్థులతో కలిసి తిరుగుబాటు చేస్తామని హెచ్చరించాయి. ప్రైవేట్ విద్యాసంస్థలు ముందస్తు అడ్మిషన్లు నిర్వహిస్తున్నా విద్యాశాఖ అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించాయి.