
టిఫిన్స్‌లో ఈగలు.. హోటల్‌కు జరిమానా
TG: రంగారెడ్డి జిల్లా ఇమాంగూడలోని తాజా టిఫిన్స్ సెంటర్ లోని టిఫిన్‌లో ఈగలు దర్శనమిచ్చాయి. ఒకరికి సాంబార్ లో మరొకరికి స్వీట్ లో కనిపించడంతో నిర్వాహకులను నిలదీశారు. వారు నిర్లక్ష్యంగా సమాధానమివ్వడంతో అధికారులకు సమాచారం ఇచ్చారు. మున్సిపల్ కమిషనర్ అక్కడికి చేరుకుని కిచెన్, ఆహార పదార్థాలను పరిశీలించి రూ.10 వేల జరిమానా విధించారు.




