ధర్పల్లిలో గణేష్ నిమజ్జనానికి విస్తృత ఏర్పాట్లు

465చూసినవారు
ధర్పల్లిలో గణేష్ నిమజ్జనానికి విస్తృత ఏర్పాట్లు
ధర్పల్లి మండల కేంద్రంలో గణేష్ నిమజ్జన శోభాయాత్రకు అధికారులు, గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు ముమ్మరం చేశారు. శోభాయాత్ర సాఫీగా సాగేందుకు రోడ్లకు మరమ్మతులు చేయించారు. గ్రామ సర్పంచ్ చెలిమెల శ్రీనివాస్, వీఎడీసీ చైర్మన్ ఆర్మూర్ రంజిత్ పర్యవేక్షణలో నిమజ్జన చెరువు కట్ట వద్ద ప్రత్యేకంగా లైటింగ్ ఏర్పాటు చేశారు. భక్తులు, గణేష్ మండలి సభ్యులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సర్పంచ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో వీడిసి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్