పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని జిల్లా అటవీశాఖ అధికారి సిద్ధార్థ్ విక్రమ్ సింగ్ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో పర్యావరణ నేపథ్య కార్యక్రమాలపై నిర్వహించిన జిల్లాస్థాయి సమీక్షలో ఆయన మాట్లాడారు. జూన్ 1 నుంచి 12వ తేదీ వరకు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పచ్చని, పరిశుభ్రమైన జిల్లాను నిర్మించే దిశగా సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు భుజంగరావు, కిరణ్ కుమార్, మునిసిపల్ కమిషనర్ కిరణ్ కుమార్, తహసీల్దార్ లు, డీఆర్వో గీత తదితరులు పాల్గొన్నారు.