మొదటి విడుత జనగణన సందర్భంగా నిజామాబాద్ లోని తన కార్యాలయంలో స్వీయ గణన (Self-Enumeration) చేసుకున్నట్లు ఎంపీ ధర్మపురి అరవింద్ తెలిపారు. ప్రజలందరూ స్వీయ గణన పోర్టల్‌ను వినియోగించుకుని, జనగణన ప్రక్రియలో చురుగ్గా పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ ప్రక్రియ ద్వారా దేశ అభివృద్ధికి దోహదపడాలని ఆయన సూచించారు.