నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని, శుక్రవారం హైదరాబాద్‌లో రైతు కమిషన్ సభ్యుడు గౌ శ్రీ గడుగు గంగాధర్, రైతు కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి, ఇతర సభ్యులతో కలిసి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం, వారు ముఖ్యమంత్రితో రైతులకు సంబంధించిన పలు సమస్యలు, రైతు కమిషన్ ద్వారా చేపడుతున్న కార్యక్రమాల గురించి చర్చించారు.