కూతురి పెళ్లి తర్వాత తండ్రి ఆత్మహత్య!

10చూసినవారు
కూతురి పెళ్లి తర్వాత తండ్రి ఆత్మహత్య!
నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం నందిగామలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. మేకల కాపరి ఎల్కా దేవన్న తన కుమార్తె ప్రవళిక పెళ్లి కోసం 30 మేకలను విక్రయించారు. ఆదివారం పెళ్లి జరిగిన కొద్ది గంటలకే, మేకల మంద తగ్గిపోవడాన్ని చూసి మనస్తాపానికి గురైన దేవన్న ఇంట్లోకి వెళ్లి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. సోమవారం వెలుగులోకి వచ్చిన ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్