అభిరుద్ది పనులపై ద్రుష్టి సరించాలి

2చూసినవారు
అభిరుద్ది పనులపై ద్రుష్టి సరించాలి
నిజామాబాద్ నగర పాలక సంస్థ పరిధిలో అభివృద్ధి పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని కలెక్టర్ టి. వినయ్ కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం ఇంజినీరింగ్ విభాగం అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన, సీసీ, బీటీ రోడ్ల ప్యాచ్ వర్క్, రోడ్ల నిర్మాణాలు ప్రారంభం కాకపోవడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సకాలంలో పనులు పూర్తి చేయాలని, లేదంటే కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్టులో పెట్టాలని ఆదేశించారు. ప్రజలకు సౌకర్యాల కల్పనలో రాజీ పడకూడదని, కాంట్రాక్టర్లకు వత్తాసు పలికే ధోరణిని అవలంబిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్