మంగళవారం నాడు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ప్రసాద్ నిర్వహించిన కౌన్సెలింగ్ అనంతరం, సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ హైమద్ మోయినుద్దిన్ ముందు హాజరుపర్చిన వారిలో, మద్యం తాగి వాహనాలు నడిపిన 21 మందికి ఒక్కొక్కరికి రూ. 10వేల చొప్పున జరిమానా విధించారు. మరో ఇద్దరికి వారం రోజుల పాటు జైలు శిక్ష పడింది. ఈ వివరాలను ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ తెలిపారు.