నూతన కాంగ్రెస్ మండల అధ్యక్షుడిగా గాదె నరేష్ బాధ్యతలు స్వీకరణ

850చూసినవారు
నూతన కాంగ్రెస్ మండల అధ్యక్షుడిగా గాదె నరేష్ బాధ్యతలు స్వీకరణ
ధర్పల్లి మండలం నూతన మండల అధ్యక్షుడిగా గాదె నరేష్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా డిసిసి వైస్ ప్రెసిడెంట్ ఆర్మూర్ చిన్న బాల్ రాజ్, గ్రామ సర్పంచ్ చెలిమెల శ్రీనివాస్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు మనోహర్ రెడ్డి, చెలిమెల నరసయ్య, సొసైటీ చైర్మన్ మల్లికార్జున్, యూత్ మండల అధ్యక్షులు దినాకర్, మంగిత్యా నాయక్, మండల కాంగ్రెస్ నాయకులు ఆయనను ఘనంగా శాలువా కప్పి సన్మానించారు. మండలంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తానని ఈ సందర్భంగా నరేష్ అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సంఘటన నిజామాబాద్ జిల్లా, నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్ ప్రాంతంలో జరిగింది.

సంబంధిత పోస్ట్