ధర్పల్లి మండలంలోని దమ్మన్నపేట గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద గాంధీ జయంతి సందర్భంగా మహాత్మా గాంధీ చిత్రపటానికి సర్పంచ్ వసంత రమేష్, గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ శ్రీనివాస్, మహిళలు వార్డు సభ్యులు
కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గాంధీజీ చూపిన అహింస, సత్యం, శాంతి మార్గాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని వారు పేర్కొన్నారు.