వీడీసీ ఆధ్వర్యంలో గణేష్ లడ్డూ వేలం

7చూసినవారు
వీడీసీ ఆధ్వర్యంలో గణేష్ లడ్డూ వేలం
నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం సిరికొండ మండలం గాడ్కోల్ గ్రామంలో వీడీసీ కమిటీ ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు గురువారం ఘనంగా జరిగాయి. ఆనవాయితీగా జరిగిన గణేష్ లడ్డూ వేలంలో గ్రామ కమిటీ చైర్మన్ కామారెడ్డి సంతోష్ రెడ్డి లడ్డూను దక్కించుకున్నారు. గణపయ్య ఆశీస్సులతో ప్రజలు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని, పంటలు సమృద్ధిగా పండాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు భూషణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్