ధర్పల్లి సితాయిపేట్ లో గంగమ్మ తల్లి జాతర: వర్షాలు, పంటల కోసం ప్రత్యేక పూజలు

842చూసినవారు
ధర్పల్లి సితాయిపేట్ లో గంగమ్మ తల్లి జాతర: వర్షాలు, పంటల కోసం ప్రత్యేక పూజలు
నిజామాబాద్ జిల్లాలోని ధర్పల్లి సితాయిపేట్ గ్రామంలో గంగమ్మ తల్లి జాతర ఉత్సవాలు రెండు రోజులుగా ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి, బోనాలు సమర్పించారు. మూడవ రోజు అమ్మవారి ఉత్సవ మూర్తిని వీధుల్లో ఊరేగించారు. గ్రామ సర్పంచ్ సిహెచ్ భూమేష్, గంగన్న (బుజ్జన్న) పల్లకి సేవలో పాల్గొన్నారు. వర్షాలు సమృద్ధిగా కురిసి, పాడి పంటలు బాగుండాలని గంగపుత్ర సంఘం సభ్యులు ప్రతి సంవత్సరం ఈ జాతరను నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్