ధర్పల్లిలో గంగమ్మ తల్లి జాతర..వర్షాలు కోసం ప్రత్యేక పూజలు

480చూసినవారు
ధర్పల్లిలో గంగమ్మ తల్లి జాతర..వర్షాలు కోసం ప్రత్యేక పూజలు
నిజామాబాద్ జిల్లాలోని ధర్పల్లి గ్రామంలో గంగమ్మ తల్లి జాతర ఉత్సవాలు రెండు రోజులుగా ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి, సోమవారం బోనాలు సమర్పించారు. మూడవ రోజున అమ్మవారి ఉత్సవ మూర్తిని గ్రామంలోని ప్రధాన వీధుల గుండా ఊరేగించారు. వర్షాలు సమృద్ధిగా కురిసి, పాడి పంటలు బాగుండాలని గంగపుత్ర సంఘం సభ్యులు తరతరాలుగా ఈ జాతరను నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో కుల పెద్దలు, సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్