ధర్పల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గెట్ టుగెదర్ పార్టీ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ N. జ్యోతి హాజరై మాట్లాడుతూ ఇలాంటి ఆత్మీయ వేడుకలు విద్యార్థులలో నూతన ఉత్సాహాన్ని, ఆత్మవిశ్వాసాన్ని నింపుతాయని అన్నారు. ప్రథమ సంవత్సరం విద్యార్థులకు తృతీయ, ద్వితీయ సంవత్సరం సీనియర్లు తమ అనుభవాలను పంచుకుంటూ చదువు, క్రమశిక్షణ, భవిష్యత్ లక్ష్యాలపై విలువైన సలహాలు సూచనలు ఇస్తారని తెలిపారు.
విద్యార్థులు సాంస్కృతిక ప్రదర్శనలతో అలరించారు. ఈ కార్యక్రమంలో బోధన అధ్యాపక, బోదనేతర, సిబ్బంది విద్యార్థినీ
విద్యార్థులు పాల్గొన్నారు.