రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రియింబర్స్‌మెంట్ బకాయిలను విడుదల చేయాలని బీసీ జేఏసీ పిలుపు మేరకు, నిజామాబాద్ జిల్లాలో బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ధర్పల్లి మండల కేంద్రంలో ప్రభుత్వ కళాశాలలను శాంతియుతంగా గురువారం బంద్ చేశారు. సుమారు 7000 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నా ప్రభుత్వం స్పందించకపోవడం, స్పష్టమైన హామీ ఇవ్వకపోవడం వల్ల లక్షలాది మంది పేద
విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఇబ్బందులు పడుతున్నారని విద్యార్థి సంఘాల నాయకులు తెలిపారు.