మంచినీటి సౌకర్యం కల్పించడంలో ప్రభుత్వ నిర్లక్ష్యం: TGVP

1చూసినవారు
మంచినీటి సౌకర్యం కల్పించడంలో ప్రభుత్వ నిర్లక్ష్యం: TGVP
నిజామాబాద్ జిల్లాలోని శంకర్ భవన్ ప్రభుత్వ పాఠశాలలో మంచినీటి ఎద్దడిపై బుధవారం TGVP టౌన్ సెక్రటరీ కేవిన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాలలో పిల్లలకు తాగడానికి శుభ్రమైన నీరు కూడా ఇవ్వలేని స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉండటం సిగ్గుచేటని, నిధులు లేక నీటి సౌకర్యం కల్పించలేమని ప్రిన్సిపాల్ చెప్పడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి అద్దం పడుతోందని ఆయన అన్నారు. తక్షణమే స్పందించి నిధులు మంజూరు చేయాలని, లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్