నిజామాబాద్ జిల్లా, దుబ్బాక గ్రామపంచాయతీలో మంగళవారం VBGRMG పథకంపై గ్రామసభ జరిగింది. గ్రామంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులు, ఉపాధి హామీ ప్రణాళికపై గ్రామస్థులతో చర్చించారు. గ్రామ అవసరాలకు అనుగుణంగా పనులను గుర్తించి, గ్రామసభ ఆమోదంతో ప్రణాళిక రూపొందించాలని అధికారులు సూచించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ అధికారులు, సర్పంచ్ సరోజిని దేవి గంగాధర్, ఉప సర్పంచ్ కోతిశేఖర్ రెడ్డి, సెక్రటరీ సాయికుమార్, ఫీల్డ్ అసిస్టెంట్, ఏఎన్ఎంలు, వార్డ్ మెంబర్లు పాల్గొన్నారు.