నిజామాబాద్ జిల్లా, ధర్పల్లి మండలం, దమ్మనపెట్ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి మంజూరు పత్రాలను సోమవారం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో మారుతి, జిల్లా డిసిసి ఉపాధ్యక్షులు ఆర్మూర్ చిన్న బాల్ రాజ్, గ్రామ సర్పంచ్ వసంత రమేష్, మండల ఉపాధ్యక్షులు నిమ్మల వినయ్, దినకర్,
కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. లబ్ధిదారులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.