మద్దుల తాండలో కళ్యాణ మండపానికి భూమిపూజ

886చూసినవారు
మద్దుల తాండలో కళ్యాణ మండపానికి భూమిపూజ
నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని మద్దుల తాండలో నిర్మించనున్న కళ్యాణ మండపానికి ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి భూమిపూజ శుక్రవారం  నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  గ్రామీణ ప్రజలకు సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు కళ్యాణ మండపం ఎంతో ఉపయోగపడుతుందని, ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి కట్టుబడి ఉందని, అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు నిరంతరం కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామ పెద్దలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. ఈ

సంబంధిత పోస్ట్