ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ టి. రాజశేఖర్ రావు ఒక యువ న్యాయవాదిని ఏకపక్షంగా 24 గంటల జ్యుడీషియల్ కస్టడీకి ఆదేశించడంపై న్యాయవాది పరిషత్ తీవ్ర దిగ్భ్రాంతి, ఆందోళన వ్యక్తం చేసింది. యువ న్యాయవాది కోర్టులో పదే పదే పశ్చాత్తాపం వ్యక్తం చేసి క్షమాపణ కోరినప్పటికీ ఈ ఆదేశాలు జారీ అయ్యాయని న్యాయవాది పరిషత్ జిల్లా అధ్యక్షులు మల్లెపూల జగన్మోహన్ గౌడ్ తెలిపారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా, ముఖ్యంగా యువ న్యాయవాదుల్లో తీవ్ర నిరాశ కలిగించింది.