నిజామాబాద్ అర్బన్ పరిధిలో జరిగిన అంతర్ పాఠశాలల క్రీడోత్సవాలను టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ప్రారంభించారు. విద్యార్థుల్లో క్రీడాస్ఫూర్తి, శారీరక, మానసిక వికాసం, క్రమశిక్షణ, టీమ్‌వర్క్, పోటీతత్వం వంటి విలువలను పెంపొందించడానికి ఇలాంటి క్రీడోత్సవాలు ఎంతో సహాయపడతాయని ఆయన పేర్కొన్నారు. ప్రతిభావంతులైన విద్యార్థులను రాష్ట్ర, జాతీయ స్థాయిలకు తీసుకెళ్లేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలను రూపొందిస్తోందని, ప్రతి పాఠశాలలో క్రీడలను బలోపేతం చేసే దిశగా చర్యలు కొనసాగుతున్నాయని మహేష్ గౌడ్ తెలిపారు.