అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్

0చూసినవారు
అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్
నిజామాబాద్ పోలీసులు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల కాపర్ కాయిల్స్ దొంగిలిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను అరెస్ట్ చేశారు. గతంలో వాహనాల దొంగతనం కేసుల్లో జైలుకు వెళ్లి, అక్కడ పరిచయమైన వారితో కలిసి ఈ ముఠాను ఏర్పాటు చేసుకున్నారు. నిజామాబాద్, నిర్మల్ జిల్లాల్లో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న వీరిని పట్టుకున్నట్లు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తెలిపారు. బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ వివరాలు వెల్లడించారు. ఈ ముఠా దొంగిలించిన బైకులపై తిరుగుతూ, పగటిపూట ట్రాన్స్ఫార్మర్లను పరిశీలించి, రాత్రిపూట వాటిని ధ్వంసం చేసి కాపర్ వైర్లను దొంగిలించేవారని సీపీ పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్